( స్వ )రససిద్ధి---------------------------
రచన ----డా ..సుమన్ లత
-------------------------------------- బ్రహ్మకడిగిన పాదధార
అన్నమయ్య ' పద ' ధారయై
సప్త గిరుల స్వరఝరు లై
స్వర్ణ 'ముఖారు'లై '
'బహుదారుల '
సోయగాల హొయలై
కోనేటి రాయునికి
కొండమల్లెల గుబాళిం పై
పలుకు తేనెల తల్లికి
పదమంజీరమై
జానపదుల 'జాజర '
జాయా -పతులకు
జాబిల్లి వెలుగులో
జాజుల 'మంజరియై '
ఆదిమధ్యాంత రహితునకు
ఆధ్యాత్మ సంకీర్తనయై
'సింగార మూరితికి '
శృంగార తిలకమై
నిత్య 'కళ్యాణ 'శ్రీపతికి
స'మ్మోహన 'లాహిరి లో
'లలిత '' లాలి 'త్య డోల యై
నారద గాన లోలునకు
నాద నీరాజనమై
మానవాళికి మేలు కొలుపై
తేట తెలుగు తీయదనమై
ఆంధ్రుల అహో భాగ్యమై
ఇందీవ రాక్షునికి
అక్షర సుమార్చనయై
లక్ష గళాలలో నినదించి
కోటి రస హృదయాలను
(సం)గీత మాధురి లో ఓలలాడించి
బ్రహ్మానంద సహొదరమై
రస హృదయాంబుధి లో
(స్వ ) రస సిద్ధి నొందె !
----------------------------------------------------------------------------------------------------------------------------
రచన ----డా ..సుమన్ లత
-------------------------------------- బ్రహ్మకడిగిన పాదధార
అన్నమయ్య ' పద ' ధారయై
సప్త గిరుల స్వరఝరు లై
స్వర్ణ 'ముఖారు'లై '
'బహుదారుల '
సోయగాల హొయలై
కోనేటి రాయునికి
కొండమల్లెల గుబాళిం పై
పలుకు తేనెల తల్లికి
పదమంజీరమై
జానపదుల 'జాజర '
జాయా -పతులకు
జాబిల్లి వెలుగులో
జాజుల 'మంజరియై '
ఆదిమధ్యాంత రహితునకు
ఆధ్యాత్మ సంకీర్తనయై
'సింగార మూరితికి '
శృంగార తిలకమై
నిత్య 'కళ్యాణ 'శ్రీపతికి
స'మ్మోహన 'లాహిరి లో
'లలిత '' లాలి 'త్య డోల యై
నారద గాన లోలునకు
నాద నీరాజనమై
మానవాళికి మేలు కొలుపై
తేట తెలుగు తీయదనమై
ఆంధ్రుల అహో భాగ్యమై
ఇందీవ రాక్షునికి
అక్షర సుమార్చనయై
లక్ష గళాలలో నినదించి
కోటి రస హృదయాలను
(సం)గీత మాధురి లో ఓలలాడించి
బ్రహ్మానంద సహొదరమై
రస హృదయాంబుధి లో
(స్వ ) రస సిద్ధి నొందె !
----------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment