మౌనభాష్యం----రచన --డా-ఆర్. సుమన్ లత
**********************
సరిహద్దు దాటిన దొంగలా
వాలి పోయిన పొద్దులా
మెల్లగా -మెత్తగా
సవ్వడి లేకనే
గుర్తు తెలియనీకనే
నిశ్శబ్దంగా
జీవితం లో
చోటు చేసుకున్న మౌనం -
తెలియనీదు దాని వైనం
మాటల కోటలను బీటలు వారించి
జీవి తానికి మారు పేరుగా మారి
'నిశ్శబ్ద భాష్యాన్ని '
మౌనంగా చాటి చెప్పింది
********************************************************************************